25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఆన్నీ అలా ..అలా..


*'ఉరుమి'. మలయాళంలో రూపొందుతున్న  చిత్రంలో జెనీలియా పోర్చుగీస్ కు చెందిన యువరాణిగా నటిస్తోంది.  కొన్ని యాక్షన్ సీన్లు కూడా ఇందులో వున్నాయట. ఆత్మరక్షణార్ధం ఈ యువరాణి ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు 'కాలరి' అనే పురాతనమైన మార్షల్ ఆర్ట్స్ ను ప్రయోగించి,తనను తాను రక్షించుకుంటుంది.
* సునీల్ హీరోగా కోటి దర్శకత్వంలో రూపొందే 'నెపోలియన్' సినిమాలో హీరోయిన్ గా  దీక్షా సేథ్ .
*   రంజిత్ కుమార్ దర్శకత్వంలో కొత్త వాళ్ళతో రూపొందుతున్న 'మౌన రాగమా' సినిమా ఆడియో ఫంక్షన్   ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.
*  దర్శకుడు పి.చంద్ర శేకర్ రెడ్డి దర్శకత్వంలో నూతన నటీనటులతో 'సైతాన్' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. దీని షూటింగ్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.
*  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'LBW' చిత్రం డల్లాస్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైంది.
*  అజిత్, త్రిష జంటగా తమిళంలో వచ్చిన ఓ చిత్రాన్ని 'పూర్ణా మార్కెట్' పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి